Support Wikipedia

Wednesday, June 18, 2008

హ్యాపీ డేస్

నేను నిన్న హ్యాపీ డేస్ మూవీ మళ్లీ చూసాను పెద్దగా తోచక. ఇండియా లో వున్నప్పుడు యువత మొత్తం కలిసి చూసాము అప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు గాని ఇప్పుడు ఇక్కడ చూస్తె బాగా నచ్చింది.

శేఖర్ కమ్ముల మంచి డైరెక్టర్. బాగా టచ్ చేసాడు - టచ్ లో వుంటాను ఇంక అతని మూవీస్ కి. మొత్తం నా లైఫ్ మొత్తం రీల్ లా తిరిగింది కళ్ళ ముందు. ఆ ఫ్రెండ్స్, ఆ ఫన్, ఆ రోజులు, ఆ క్లాస్స్లు, ఆ రోడ్లు, ఆ గోల, ఆ లవ్ లు, ఆ అర్ధం కాని పులిహోర అంతా చాల చాల బాగా క్లియర్ గా కనిపించింది కళ్ళముందు. థాంక్స్ శేఖర్!

ఎందుకో తెలియదు కాని నాకు ఇలా అమెరికా లో డాలర్స్ కోసం పాకులాడటం కొంచం చిన్నపిల్లల్లా అనిపిస్తోంది - ఇండియా లో హ్యాపీ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాడిని ఇక్కడ ఒక్కడినే ఇలా ....

ఐనా ఒక ౩-4 సంవత్సరాల్లో తిరిగి మళ్లీ వేల్లకపోతానా ? అప్పుడు చెయ్యొచ్చు ఎంజాయ్ అని నాకు నేనే సర్దిచెప్పుకుని పడుకున్నాను.

జావా ఒక అగాథం

నేను అమెరికా వచ్చినప్పటి నుంచి పెద్దగా ఆలోచించలేదు నేను ఏం చేద్దాం ఇక్కడ అని కాని ఏదో ఒక ధీమా వుండేది మనం హీరో అని. వచ్చి ఒక నెల రోజులు అయ్యింది కాని నేను పెద్దగా పీకింది ఏం లేదు రొజూ ఇంట్లో నిద్ర పోవటం తప్ప. ఒక రెండు రోజుల నుంచి ఏదో అసంతృప్తి నేను ఏం చేస్తున్నాను అని. ఇంక ఈ రోజు ఇలా ఐతే కష్టం అని కూర్చుని జావా పుస్తకం పట్టుకున్నాను నిద్ర రాక. వామ్మో జావా ఏదో అనుకున్నా గాని చాలా పెద్ద అగాథం. రెండు chapters చదివాను అప్పుడు అనిపించింది మనకి J2EE అంతగా రాదేమో అని. ఇంకో ఒక chapter చదివాను అస్సలు రాదు అని confirm అయ్యింది.

ఇలానే వుంటే కష్టం సో నేను ఈ రోజు ఫిక్స్ అయ్యింది ఏంటి అంటే - ఒక నెల రోజులు కాస్త కష్ట పడి ఆ J2EE ఏదో కరెక్ట్ గా నేర్చుకుంటే ఇంక మనం ఇక్కడ కుమ్మేయ్యోచ్చు అని. చూద్దాం మరి అది ఎలా జరుగుతుందో...

గుడ్ లక్ రా జాన్ గా
Support Wikipedia Support Wikipedia Support Wikipedia Support Wikipedia Support Wikipedia Support Wikipedia